

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా, అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా చైనా పీస్. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై మంచి ఆసక్తిని కలిగించింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ అంశాలతో టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘భగ భగ’ అనే పవర్ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను కంపోజర్ కార్తిక్ దేశభక్తి భావాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.
గాయకుడు కాల భైరవ తన శక్తివంతమైన గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు. పదాలను ఆయుధాలుగా మార్చి రాసిన రెహమాన్ లిరిక్స్ పాటకు మరింత బలం చేకూర్చాయి. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!