

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. నటుడిగా మాత్రమే కాదు, తన ఆలోచనలు, నిర్ణయాల ద్వారా కూడా అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుంటారు.
తాను చేసే ఒక చిన్న తప్పు ఎంతోమంది పై ప్రభావం చూపుతుందన్న భావనతో, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో ఆలోచిస్తారని అభిమానులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఒక టొబాకో ఉత్పత్తి ప్రకటనకు ఆయన తిరస్కారం తెలిపినట్లు సమాచారం.
ఆ ప్రకటన కోసం సంబంధిత సంస్థ భారీ మొత్తంగా సుమారు నలభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేహం లేకుండా నో చెప్పారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మా హీరో డబ్బు కోసం విలువలను వదలడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!