
జనరల్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఓటీటీ విడుదలకు ముందే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను తగ్గించినట్లు చిత్రబృందం ప్రకటించింది. కుటుంబ ప్రేక్షకులకు ఇది మంచి అవకాశంగా మారనుంది.
తాజా నిర్ణయం ప్రకారం తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను రూ.50 నుంచి రూ.105 మధ్య నిర్ణయించారు. ఈ ధరల తగ్గింపుతో ప్రేక్షకుల సంఖ్యతో పాటు వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ నిర్మించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!