

బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని ఆమె స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా తెలియజేశారు. మద్యం తాగిన ఓ కారు డ్రైవర్ తన కారును ఢీ కొట్టాడని, ఆ సమయంలో తన తల కార్ విండోకు బలంగా తగిలిందని నోరా తెలిపారు. ప్రమాదం జరిగిన క్షణాల్లో ఏం జరిగిందో తనకు స్పష్టంగా గుర్తు లేదని ఆమె చెప్పారు.

ప్రస్తుతం తాను బాగానే ఉన్నప్పటికీ తలకు వాపు ఉండడంతో పాటు కొన్ని గాయాలు ఇంకా మానలేదని నోరా వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని చాలా భయానక ఘటనగా ఆమె పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఎవ్వరూ ప్రోత్సహించకూడదని విజ్ఞప్తి చేస్తూ, మద్యం మత్తులో డ్రైవింగ్ వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె భావోద్వేగంగా తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.
.jpg&w=3840&q=75)
















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!