
జనరల్

ప్రేమించుకున్న ఒక జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దల్ని ఒప్పించే ప్రయత్నంలో ఉండగా, ఆమె ప్రేమికుడి తండ్రి అతనికి తెలియకుండా వేరే అమ్మాయితో వివాహం చేయాలని ప్లాన్ చేస్తాడు. దీంతో ఆ యువతి తన ప్రేమికుడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి ఊరేగింపుతో అక్కడికి బయలుదేరుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ‘రజనీ కీ బారాత్’ సినిమా కథ.
ఉల్కా గుప్తా, జరీనా వహాబ్, అశ్వత్ భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిత్య అమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిందీ కామెడీ డ్రామా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. “రజనీ పెళ్లి ఊరేగింపు జరగబోతోంది, మీరు అందరూ అతిథులుగా వస్తున్నారు” అనే క్యాప్షన్‌తో ప్రమోట్ చేశారు. ఉల్కా గుప్తా టైటిల్ పాత్రలో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!