
సినిమాలు

నాని నటిస్తున్న ది పారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట “ఆయా షేర్” ఇప్పటికే పెద్ద హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాట 101 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, నాని కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ స్థాయిని చేరిన పాటగా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయి స్పందన రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ పాటలో నాని ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్స్, హుక్ స్టెప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ స్లమ్ సెట్‌లో తీసిన ఈ పాట విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాట విజయంతో ది పారడైజ్పై అంచనాలు మరింత






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!