

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచగా, మరో 44 రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ వండర్‌గా ఇది నిలుస్తుందనే అంచనాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే గ్లింప్స్‌తో మంచి స్పందన తెచ్చుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, ప్రముఖ టెక్నికల్ టీమ్స్ గ్రాఫిక్స్‌పై పనిచేస్తున్నాయి. హిందీ హక్కులను జీ స్టూడియోస్, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకోవడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త విజువల్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!