

నాగ్ అశ్విన్ తన నిరాడంబర స్వభావంతో మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కిన సింగ్ గీతం చిత్ర ప్రచార కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరయ్యారు. కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అయితే అతిథుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సీట్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాంటి హడావిడి చేయకుండా నాగ్ అశ్విన్ తనకు కేటాయించిన సీటును వదిలి నేలపై కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడైనా, ప్రత్యేక హోదా కోరుకోకుండా సాధారణ వ్యక్తిలా వ్యవహరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, “విజయం ఎంత వచ్చినా వినయం కోల్పోలేదు”, “ఇదే నిజమైన గొప్పతనం” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!