

సంక్రాంతి సందర్భంగా విడుదలైన చార్మింగ్ స్టార్ శర్వా సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ భారీ విజయం సాధించింది. ఈ నెల 14 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతూ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సినిమా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతూ రోజురోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతోంది.
ఈ విజయం గురించి శర్వా మాట్లాడుతూ, “ఈ సినిమా విజయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కంటెంట్‌పై మాకు మొదటి నుంచే నమ్మకం ఉంది. అందుకే చివర్లో విడుదల చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని విశ్వసించాం. ఆ నమ్మకం నిజమైంది. సినిమాకు మంచి లాంగ్ రన్ ఉంటుంది” అన్నారు. అలాగే నిర్మాత, దర్శకుడు, హీరో కలిసి పనిచేస్తే బడ్జెట్ పెంచకుండా మంచి సినిమా చేయొచ్చని తెలిపారు.
ఈ చిత్రానికి నటీనటులందరి పెర్ఫార్మెన్స్ ప్రధాన బలంగా నిలిచిందని శర్వా చెప్పారు. నరేష్, వెన్నెల కిషోర్, సత్య, సంపత్ పాత్రలు బాగా కుదిరాయని, క్లీన్ కామెడీని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ ప్రాజెక్ట్స్‌గా ‘బైకర్’, ‘భోగి’ చిత్రాలు ప్రేక్షకులను గర్వపడేలా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!