
.png&w=3840&q=75)
నందమూరి బాలయ్య తాజాగా నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. డిసెంబర్ 11వ తేదీన రాత్రి అఖండ 2 సినిమా రిలీజ్ అయింది ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో అఖండ 2 సినిమా సందడి స్పష్టంగా కనిపిస్తోంది. అటు అఖండ2 సినిమా రిలీజ్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు ఒంగోలు సినిమా థియేటర్ వద్ద బాలయ్య అభిమానుల సందడి నెలకొంది. అఖండ 2 విడుదల సందర్భంగా జై బాలయ్య నినాదంతో డాన్సులు చేస్తున్నారు. ఇతర దేశాల ప్రయాణాలు వాయిదా వేసుకున్న బాలయ్య అభిమానులు... థియేటర్లలో సందడి చేస్తున్నారు. అఖండ 2 సినిమా ఘన విజయం సాధిస్తుంది... రికార్డులు బద్దలు కొడుతుందని అంటున్నారు. సినిమా విడుదల ఆలస్యం అయినా విజయాన్ని ఆపలేరని పేర్కొంటున్నారు. అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు, తొక్కిసలాట జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!