
జనరల్

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ చేసిన పెళ్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సారా, పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరి నిర్ణయం కాదని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల విడాకుల ప్రభావం తన ఆలోచనలపై బలంగా పడిందని కూడా వెల్లడించింది.
సమాజం ఒత్తిడితో లేదా ఒంటరితనం భయంతో వివాహం చేసుకోవడం సరైన నిర్ణయం కాదని సారా అభిప్రాయపడింది. సరైన వ్యక్తి దొరకకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండడానికైనా సిద్ధమేనని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!