

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగిపోయింది. భారీ బడ్జెట్లు, స్టార్ హీరో హీరోయిన్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే కథ బలంగా ఉంటే కొత్త నటీ నటులతో చేసిన సినిమాలు కూడా భారీ విజయాలను సాధిస్తాయని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఛావా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా, కేవలం రూ.90 కోట్ల బడ్జెట్తో రూపొందించి రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా భారీ విజయాన్ని అందుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. విడుదలైన 37 రోజుల్లోనే రూ.775 కోట్ల వసూళ్లు సాధించింది. శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా, మరాఠా రాజు శంభాజీ మొఘలులపై చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. విక్కీ కౌశల్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!