

నటసింహం నందమూరి బాలకృష్ణపై సీనియర్ నటి లయ చేసిన ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘విజయేంద్ర వర్మ’ సినిమా షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకున్న లయ, సెట్స్‌లో బాలయ్య ఎనర్జీ, క్రమశిక్షణ, సరదా స్వభావం అసాధారణమని తెలిపారు. ఆయన సెట్లో ఉంటే వాతావరణమే మారిపోతుందని, ఆయనతో కలిసి పని చేయడం తన కెరీర్లో ఒక మధుర జ్ఞాపకమని లయ అన్నారు. అవకాశం వస్తే మళ్లీ ఆయనతో నటించాలని తన కోరికగా కూడా వెల్లడించారు.
దశాబ్దాలుగా టాలీవుడ్లో తనదైన మాస్ ఇమేజ్‌తో బాలకృష్ణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అభిమానులతో ఆయనకు ఉన్న అనుబంధం, తెరపై పవర్ఫుల్ ప్రెజెన్స్, బయట సింపుల్ వ్యక్తిత్వం ఆయన క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. 2004 డిసెంబర్ 15 న విడుదలైన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలో బాలకృష్ణ ఆర్మీ ఆఫీసర్‌గా నటించగా, లయ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోకపోయినా, షూటింగ్ సమయంలో ఏర్పడిన అనుబంధాన్ని లయ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ‘స్వయంవరం’, ‘ప్రేమించు’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి హిట్లతో స్టార్ హీరోయిన్గా నిలిచిన లయ తాజా చిత్రం ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈ నెల12 న ఓటీటీలో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!