

లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సతీ లీలావతి’ చిత్రం ప్రేక్షకులను వినోదంతో ఆకట్టుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే చూసినట్లు తెలిపిన లావణ్య, ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుందని అన్నారు.
చిత్రీకరణ సమయంలోనే తాను గర్భవతినని తెలిసినా టీమ్ సపోర్ట్‌తో షూటింగ్ పూర్తి చేశానని ఆమె వెల్లడించారు. ఈ సినిమాలో తాను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని, ఇందులో కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలిపారు. రామ్ చరణ్, చిరంజీవి తమకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబంతో గడపడానికి సినిమాలకు విరామం తీసుకుంటున్నానని లావణ్య చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!