

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చుట్టూ ఉన్న ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మాత నాగ వంశీ నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఫస్ట్ లుక్ విడుదల అవుతుందన్న ప్రచారం జరిగినా, మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే నాగ వంశీ సోషల్ మీడియాలో తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలోనే సెట్లో కలుస్తామన్న సంకేతాలు ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లేనని భావిస్తున్నారు. ఇక జూన్‌లో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్‌తో సినిమా చేస్తున్నారు. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రారంభంపై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!