

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తాత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం బెంగళూరులోని కిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన స్పెషాలిటీ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా కోసం పూర్తిగా మారిపోయిన ఆయన మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్, “కర్ణాటకకు రావడం అంటే అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. 1983 మార్చి 20న ఇదే ఆసుపత్రికి మా తాతగారు శంకుస్థాపన చేశారు. ఇన్నేళ్ల తర్వాత అదే నెలలో మళ్లీ ఇక్కడికి రావడం ఆయన ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే సాధ్యమైంది” అని అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, ఇందులో ఆయన సరసన రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!