

సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, కానీ పెద్ద సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు సృష్టించడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
‘పెద్ది’ సినిమాకు సహకరించకపోతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని నట్టి కుమార్ హెచ్చరించారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ వెనుక కొందరు పెద్ద నిర్మాతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి సమస్యలు లేకుండా సినిమా విడుదలకు సహకారం లభిస్తోందని తెలిపారు. మంగళవారం లోపు పరిష్కారం రాకపోతే బుధవారం నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట దీక్ష చేపడతానని ఆయన వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!