
ఓటీటీ

టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ అంటే సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ పేరు ముందుగా వినిపిస్తుంది. అలాగే ఎస్. థమన్ కూడా మాస్ ఎనర్జీ నంబర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ A. R. రెహమాన్ ఈ జానర్లో పెద్దగా కనిపించకపోవడం వల్ల ‘పెద్ది’ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్‌పై ఆసక్తి పెరిగింది.
శ్రుతి హాసన్‌పై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన లిరిక్స్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా వెల్లడించడంతో అంచనాలు మరింత పెరిగాయి. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో DSP–చంద్రబోస్ కాంబోతో వచ్చిన ఐకానిక్ ఐటమ్ సాంగ్స్‌తో పోలిస్తే, ఈసారి అనంత శ్రీరామ్–A. R. రహమాన్ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!