

హాలీవుడ్ ఫాంటసీ యాక్షన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి భారీ విజువల్ ట్రీట్ తెలుగు ప్రేక్షకుల కోసం మరింత ప్రత్యేకంగా మారుతోంది. “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” సినిమాకు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వాయిస్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి పేరుగాంచిన నిఖిల్ ఇప్పుడు హాలీవుడ్ సూపర్ హీరోకు గాత్రదానం చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ చిత్రంలో హీ-మ్యాన్ పాత్రకు నిఖిల్ వాయిస్ అందించగా, ట్రైలర్లో అతని గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విలన్ స్కెలెటర్‌కు ఆదిత్య మీనన్ గంభీర స్వరం ఇవ్వగా, డంకన్ పాత్రకు రావు రమేష్ వాయిస్ ఇచ్చారు. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో నికోలస్ గలిట్జైన్, కమిలా మెండెస్, జారెడ్ లెటో, ఇడ్రిస్ ఎల్బా వంటి అంతర్జాతీయ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!