

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ స్పందించారు. ప్రసవం తర్వాత ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెపై కొందరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోల్స్ చేశారు. ఇన్నాళ్లూ ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న కత్రినా, లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి స్పందించారు. ఆన్‌లైన్‌లో ఇతరులు ఏం మాట్లాడినా వాటిని పట్టించుకుని కుంగిపోకూడదని, వారి వ్యాఖ్యల ఆధారంగా మన నిర్ణయాలను మార్చుకోకూడదని ఆమె అన్నారు.
ప్రతి ఒక్కరి విమర్శలను పట్టించుకుంటే తాను ఎప్పుడో భయంతో వెనక్కి తగ్గేదాన్నని కత్రినా పేర్కొన్నారు. మనల్ని ఇతరులు మెచ్చుకునే సందర్భాలు ఉంటాయని, అయితే కొన్ని సమయాల్లో మనల్ని మనమే ప్రోత్సహించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనపై మనకు నమ్మకం ఉంచుకోవడం ముఖ్యమని తెలిపారు. జీవితంలో మంచి రోజులతో పాటు కష్టకాలాలు కూడా వస్తాయని, విమర్శలను తేలికగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!