

‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు “దీవాన” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. వన్ సైడ్ లవ్ స్టోరీలోని మ్యాడ్‌నెస్‌ను వినోదాత్మకంగా చూపించే ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ‘ఇది ప్రేమా.. ఇది ప్రేమా..’ పాటకు అద్భుతమైన స్పందన రాగా, తాజాగా మేకర్స్ ఎనర్జిటిక్ లిరికల్ సాంగ్ ‘తెల్లపోరి...’ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా సాహిత్యం రాసి స్వయంగా ఆలపించారు. ‘ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనే క్యాప్షన్‌కు తగ్గట్టుగా సరదా సాహిత్యం, టీజింగ్ స్టైల్ కంపోజిషన్‌తో ఈ పాట యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!