

శ్రీకాంత్ కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోగా మరోసారి మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలతోనే మంచి బజ్ సొంతం చేసుకుంది. మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య సాగే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ సినిమా ప్రతిబింబించనుంది.
ఈ చిత్రంలో శ్రీకాంత్ వెంకటరమణ అనే సాధారణ వ్యక్తిగా కనిపించనుండగా, జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా తన భక్తి తగ్గదు. అతని బాధలను చూసిన గోవిందుడు భూమిపైకి వచ్చి సహాయం చేసే అంశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దేవుడి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనుండటం విశేషం. అలాగే సునీల్, ఆలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ రాజ్ కామెడీ ట్రాక్‌లో అలరించనుండగా, హీరోయిన్‌గా లయ నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భక్తి, వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!