

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కెవి అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను వెల్లడించారు. ‘ఫంకీ’ చిత్రాన్ని ఫిబ్రవరి 13 న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వాలెంటైన్స్ డే ట్రీట్‌గా ప్రేక్షకులకు ఈ సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని, విశ్వక్ సేన్ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.








.webp&w=3840&q=75)









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!