
సినిమాలు

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ సినిమా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరించబడింది. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథను రచించారు.
మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఇదొకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మాస్ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!