

జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ ఈ నెల 7 న విడుదల చేసిన ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విడుదలైన కేవలం 48 గంటల్లోనే ఈ ట్రైలర్ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి 312 మిలియన్ వ్యూస్‌ను దాటుతూ రికార్డు సృష్టించింది. సినిమా చుట్టూ ఉన్న భారీ ఆసక్తిని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 45 కు పైగా దేశాల్లో ట్రెండింగ్‌లో ఉండటం గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ట్రైలర్‌లోని పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ అనేక రీల్స్ మరియు ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో జస్కిరత్ సింగ్ రంగీ మరియు హమ్జా అలీ మజారి పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్. మాధవన్ అజయ్ సన్యాల్‌గా, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా, సంజయ్ దత్ ఎస్పీ చౌధరిగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రం జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2026 ఈ నెల 19 న గుడి పాడ్వా, ఉగాది సందర్భంగా, ఈద్‌కు ముందు థియేటర్లలో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!