

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ సారేగమా దాఖలు చేసిన కేసులో కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, 130కు పైగా సినిమాలకు సంబంధించిన కొన్ని సౌండ్ రికార్డింగ్స్, సంగీత కృతులను వాణిజ్యపరంగా వినియోగించకుండా ఇళయరాజాను ఆదేశించింది. ఆయా పాటల కాపీరైట్స్ సంస్థకే చెందుతాయని సారేగమా వాదించింది.
సారేగమా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, సంబంధిత సినిమాల నిర్మాతలు ముందుగానే సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పాటలను వినియోగించే హక్కులను అప్పగించినప్పటికీ, ఇళయరాజా మూడో వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పాటలను విడుదల చేయడం కాపీరైట్ ఉల్లంఘనగా పేర్కొంది.
కాపీరైట్ చట్టం–1957 ప్రకారం, సాధారణంగా సినిమా నిర్మాతకే మొదటి కాపీరైట్ హక్కు ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. ఒప్పందాల ఆధారంగా ఈ దశలో సంస్థ హక్కులను రక్షించడం అవసరమని పేర్కొంటూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’ పాట హక్కుల వివాదంలో కూడా గతంలో కోర్టు సారేగమా పక్షాన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!