
జనరల్

అనన్య పాండే, లక్ష్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘చాంద్ మేరా దిల్’ విడుదలకు ముందే సెన్సార్ కట్స్ కారణంగా వార్తల్లో నిలిచింది. చిత్రంలోని కొన్ని రొమాంటిక్, సన్నిహిత దృశ్యాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య ఉన్న లిప్‌లాక్ సీన్ తొలగించాలని సూచించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు 96 సెకన్ల రొమాంటిక్ కంటెంట్‌పై కత్తెర వేసిన తర్వాత చిత్రానికి యూఏ 16 ప్లస్ సర్టిఫికేట్ లభించింది. వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, సెన్సార్ కట్స్ తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!