
.jpg&w=3840&q=75)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రేటింగులు బాగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా దివ్య–తనూజ స్టేజ్‌పై జరిగిన ఘర్షణ ప్రేక్షకుల్లో భారీ చర్చకు దారి తీసింది. ఇంతకాలం కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడినా, ఈ సీజన్లో నిజమైన ఫైర్ వార్ వీరిద్దరి మధ్యే జరిగిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దివ్యకు భారీ సంఖ్యలో ఫ్యాన్ సపోర్ట్ లభిస్తుండగా, తనూజకు కూడా బలమైన ఫ్యాన్ బేస్ నిలబడింది. ఈ పరిస్థితుల్లో ఎవరి ఎలిమినేషన్ చేసినా ప్రేక్షకుల్లో ప్రతికూల స్పందన రావొచ్చనే భయంతో బిగ్ బాస్ యాజమాన్యం చిక్కుల్లో పడినట్టు సమాచారం.
ఈ వారం పోల్స్ ప్రకారం దివ్య లేదా సంజన ఎలిమినేట్ కావాల్సి ఉండేది. కానీ దివ్యకు వచ్చిన ప్రతిస్పందన, మరియు సంజనను కూడా కాపాడాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీమ్ ఇమ్మాన్యుయెల్ పవర్ అస్త్రను యాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది.
దీంతో ఈ వారం ఎవరినీ ఇంటి బయటకు పంపకూడదనే నిర్ణయానికి బీబీ టీమ్ వచ్చింది. అందువల్ల ఈ వారం హౌస్‌లో ఎటువంటి ఎలిమినేషన్ ఉండదనే టాక్ వినిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!