
గాసిప్స్

నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఈ ఏడాది ఆమె ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం లేకుండా వ్యక్తిగత విషయాలను ప్రచారం చేయడం సరైంది కాదని, ఊహాగానాలను నిజాలుగా చూపించడం బాధ్యతారాహిత్యమని టీమ్ పేర్కొంది.
ఇంకా అనుష్క వయసుపై వస్తున్న వ్యాఖ్యలపైనా టీమ్ తీవ్రంగా స్పందించింది. మహిళల విషయంలో మాత్రమే వయసును హైలైట్ చేయడం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించింది. అనుష్క తన కెరీర్‌ను ప్రతిభతో నిర్మించుకున్నారని, వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలనే ఆమె నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. వివాహం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం అని, దానిని సెన్సేషనల్ న్యూస్‌గా మార్చడం తగదని టీమ్ స్పష్టం చేసింది.





.jpg&w=3840&q=75)
.jpeg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!