

స్టార్ హీరో కార్తి నటించిన “అన్నగారు వస్తారు” సినిమా ఈ నెల 12 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించగా, “సూదు కవ్వుం” ఫేమ్ నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్-కామెడీ ఫాంటసీ చిత్రం 70 - 80 ల మాస్ కమర్షియల్ సినిమాలకు ట్రిబ్యూట్‌గా తెరకెక్కింది. కార్తి ఈ చిత్రంలో సూపర్‌హీరో లాంటి భారీ పాత్రలో కనిపించనున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీంద్రన్, శైలేష్ కొలను, బాబీ వంటి యంగ్ డైరెక్టర్లు, సందీప్ కిషన్, బన్నీ వాసు, రాకేందు మౌళి తదితరులు పాల్గొని కార్తి వెర్సటాలిటీ, స్క్రిప్ట్ సెలక్షన్‌ను కొనియాడారు.
కార్తి మాట్లాడుతూ “ఇది నాకు చాలా ఛాలెంజింగ్ మూవీ. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి మన సూపర్ హీరోలు మళ్లీ వస్తే ఎలా ఉంటుందనే ఊహా ప్రపంచంలో ఈ కథ జరుగుతుంది. ఇలాంటి భిన్నమైన సినిమాను మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది” అని చెప్పారు. కృతి శెట్టి తన తమిళ డెబ్యూ కోసం ఇంతకంటే మంచి సినిమా, మంచి కో-స్టార్ దొరకడం అదృష్టమని, నలన్ సార్ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారని అన్నారు. ట్రైలర్‌కు వచ్చిన అదిరిపోయే స్పందనతో టీమ్ అంతా బిగ్ హిట్‌ను ఆశిస్తోంది.
_1771477764226.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!