

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, అభిమానులను ఉర్రూతలూగించే పాత్రలు గుర్తుకొస్తాయి. ‘వీరసింహారెడ్డి’ ఘన విజయానంతరం బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ‘ఎన్బీకే 111’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల విడుదలైన పోస్టర్‌లో కనిపించిన ‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ ట్యాగ్‌లైన్ అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ సినిమాలో బాలకృష్ణ పూర్తిగా భిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్, పాత్ర రూపకల్పనతో కనిపించనున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల కానున్న ప్రత్యేక అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!