

చెన్నైలో తెలుగువారి ప్రతిష్ఠను నిలబెట్టే లక్ష్యంతో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ 1998 నవంబర్ 21 న స్థాపించబడింది. ఈ సంస్థ 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ రోజు 28 వ ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15, ఆదివారం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరుగుతుంది. ఈ వేడుకలో గత ఏడాదిలో విడుదలైన తెలుగు సినిమాలకు సంబంధించిన నటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులను ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నారు. అలాగే వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలకు మహిళా రత్న పురస్కారం అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ కళా సుధ సభ్యులతో పాటు చెన్నైలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డా. పెమ్మసాని చంద్రశేఖర్, విశిష్ట అతిథిగా ఎంవీఆర్ మురళీ కృష్ణ హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా ఎ. సాయి ప్రసాద్, సాహు గారపాటి, శశికాంత్ వల్లేపల్లి, ముబా పద్మయ్య, రాజమౌళి శీర్ణ, సరోజ వివేకానంద్ పాల్గొంటారు. ప్రజా సేవ రంగంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి వశిష్ట ఉగాది పురస్కారం ఇవ్వనున్నారు. అలాగే మహిళా రత్న పురస్కారం శ్రీమతి మమత మాది రెడ్డికి, అందెశ్రీ స్మారక పురస్కారం ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కి అందజేయనున్నారు. పిబి శ్రీనివాస్ పురస్కారంను తండ్రిని చిత్రానికి గాను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందుకోనున్నారు.
ఇక సినీ విభాగంలో ఉత్తమ చిత్రం – మిరాయ్, ఉత్తమ సంచలన చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ జ్యూరీ అవార్డు చిత్రం – డ్యూడ్ గా ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడు – అక్కినేని నాగ చైతన్య, ఉత్తమ నటి – రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడు – అనిల్ రావిపూడి, ఉత్తమ మాటల రచయిత – మహేష్ బాబు పి, ఉత్తమ ఛాయాగ్రాహకుడు – నికేత్ బొమ్మి, ఉత్తమ ప్రతినాయకుడు – దీక్షిత్ శెట్టి, ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్ సిసిరోలియో అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నూతన దర్శకుడు – రామ్ జగదీష్, ఉత్తమ నూతన నటుడు – హర్ష్ రోషన్, ఉత్తమ నూతన హీరో – కిరీటి రెడ్డి, ఉత్తమ గాయకుడు – రమణ గోగుల, ఉత్తమ గాయనీ – హరిప్రియ అవార్డులు పొందారు. అలాగే ఉత్తమ నూతన నటీమణులు – ఐశ్వర్య అర్జున్, అనస్వర రాజన్, సాక్షి మడోల్కర్, డైలాగ్స్ మరియు దర్శకుడు – రాహుల్ రవీంద్ర, ఉత్తమ బాల నటుడు – బుల్లి రాజుగా ఎంపికయ్యారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!