
సినిమాలు

సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో ఈ చిత్రం పండుగ సీజన్లో భారీ ఆదరణ పొందింది.
ఈ ఘన విజయం నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ‘శశిరేఖ’ ఫుల్ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు భీమ్స్ స్వరాలు అందించగా, గాయని మధుప్రియతో కలిసి ఆయన స్వయంగా గానం చేశారు. ఇప్పటికే ఆడియో రూపంలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ పాట, ఇప్పుడు వీడియో రూపంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!