

అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా సాధారణ సమస్య. మన శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఉన్నప్పటికీ, స్థాయిలు ఎక్కువైనప్పుడు గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే ముఖ్యమైన పదార్థం, ఇది కణాల నిర్మాణం, విటమిన్ డి మరియు హార్మోన్ల ఉత్పత్తిలో సహాయం చేస్తుంది.
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది – చెడు (LDL) మరియు మంచి (HDL). ఎక్కువగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, అది రక్తనాళాల్లో ఫలకాలు ఏర్పరచి గుండె జబ్బులు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. మంచి కొలెస్ట్రాల్ మాత్రం ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
లక్షణాలు:
ఛాతీ నొప్పి
కాళ్లలో నొప్పి, తిమ్మిరి
చర్మ మార్పులు
తలనొప్పి, తలతిరగడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
అలసట, వాపు
హృదయ స్పందనలో మార్పులు
దవడ, మెడ వెనుక నొప్పి
కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కారణాలు: టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం, వ్యాయామం చేయకపోవడం, మరియు మద్యం అధికంగా సేవించడం. అధిక కొలెస్ట్రాల్ నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ, ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా ఉంచడం, మరియు ధూమపానం మానడం అవసరం. ఈ అలవాట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ పెంపొందించడంలో సహాయపడతాయి.
గమనిక: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను గుర్తించి, జీవనశైలి మార్పులతో గుండె ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యము. లక్షణాలు తీవ్రమైనవిగా ఉంటే లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!