
జనరల్

చేపలు ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం అయినప్పటికీ, అందరికీ అవి అనుకూలం కావు. యూరిక్ యాసిడ్ సమస్య, చర్మ వ్యాధులు లేదా అలర్జీలు ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలలో ఉన్న ప్యూరిన్లు రక్తంలో యూరిక్ యాసిడ్‌ను పెంచి కీళ్ల నొప్పులు, గౌట్ సమస్యలకు దారితీస్తాయి.
కొంతమందికి చేపలు తినడం వల్ల దద్దుర్లు, దురద వంటి అలర్జీలు వస్తాయి. సముద్ర చేపల్లో మెర్క్యురీ అధికంగా ఉండే అవకాశం ఉంది, ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా వైద్యుల సలహా తీసుకోవాలి. చేపలు ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకుని సరిగా వండుకుని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!