

చాలామంది రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు టీ తాగడం అలవాటుగా చేసుకుంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసేవారు టీ ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వేసవికాలంలో అధికంగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో టీ అధికంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. శరీరంలోని నీటి శాతం తగ్గి ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే పొట్టలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
కొంతమందిలో వేసవిలో టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీని అతిగా తాగడం మొదట శరీరాన్ని వేడిగా అనిపించవచ్చు, కానీ లోపల ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది. ముఖ్యంగా చక్కెర మరియు కెఫిన్ అధికంగా ఉన్న టీలు తాగితే చర్మం పొడిబారడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వేసవిలో చర్మం అధిక వేడికి గురవుతుండటంతో, పదేపదే టీ లేదా కాఫీలు తాగడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
టీలోని టీనిన్ పదార్థం అధికంగా తీసుకుంటే కొంతమందిలో జీర్ణక్రియ మందగించి ఆకలి తగ్గడం, పేగు సమస్యలు రావచ్చు. వేసవిలో కాస్త చల్లారిన హెర్బల్ టీలు తీసుకోవడం మంచిది. కెఫిన్ ఉన్న టీని పరిమిత మోతాదులో తీసుకుంటే శక్తి, మానసిక చురుకుదనం పెరుగుతాయి. అయితే అతిగా తాగితే అలసట, దుర్బలతకు దారితీస్తుంది. అందువల్ల వేసవిలో టీ తాగవచ్చు కానీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. డీహైడ్రేషన్, చర్మ మరియు జీర్ణక్రియ సమస్యలను నివారించేందుకు తగినంత నీరు, నారింజ రసం, హెర్బల్ లేదా గ్రీన్ టీలు తీసుకోవడం మంచిది. అధిక చక్కెర కలిగిన ఐస్ టీలు శరీర ఉష్ణోగ్రతను పెంచే అవకాశం ఉండటంతో వాటిని తగ్గించడం ఉత్తమం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!