

ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను కోరింది. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 112 మెడికల్ సీట్లు ఇంకా భర్తీ కాలేదని సమాచారం. అక్టోబర్ 23తో రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ ముగియగా, ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల గడువు కూడా ముగియనుండటంతో మిగిలిన సీట్ల భర్తీపై ఆందోళన నెలకొంది.
ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 15 రోజుల గడువు ఇవ్వాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సంబంధిత అధికారులకు లేఖ రాసింది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నీట్ యూజీ అర్హత పర్సంటైల్‌ను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని జాతీయ వైద్య కమిషన్ తెలిపినట్లు సమాచారం. గడువు పొడిగింపు, అర్హత ప్రమాణాల్లో మార్పులపై తుది నిర్ణయం అధికారుల పరిశీలన అనంతరం వెలువడనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!