
రాజకీయాలు

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన చిరకాల ప్రేమికుడు ఇసాయ్ నట్టర్‌తో ఆమె అమెరికాలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటైనట్లు తెలుస్తోంది. సుమారు 14 ఏళ్లుగా కొనసాగిన వీరి ప్రేమ ప్రయాణం పెళ్లితో కొత్త మలుపు తిరిగింది. ఈ వివాహం అంజన, ఇసాయ్ జీవితాల్లో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది.
కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ సర్జా కుటుంబ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ వివాహ వార్తపై ఆసక్తి చూపిస్తున్నారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు పోస్టులు చేస్తున్నారు. అయితే, వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, అతిథుల జాబితా వంటి అంశాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!