

అమీబా అనే ఏకకణ జీవులు సాధారణంగా నీటిలో ఉండే బ్యాక్టీరియాను ఆహారంగా తీసుకుని నీటి వనరులను శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణ సమతుల్యతకు తోడ్పడే ఈ సూక్ష్మజీవులు, వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలను, క్రిమిసంహారకాలను తట్టుకునే సామర్థ్యం వల్ల వీటిని నియంత్రించడం కష్టంగా మారుతోంది. అందుకే మెరుగైన నిఘా వ్యవస్థలు, సమర్థవంతమైన నీటి శుద్ధి విధానాలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవల ‘బయోకాంటెమినెంట్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పాత నీటి సరఫరా వ్యవస్థలు, తగిన శుద్ధి లోపం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అమీబాల వ్యాప్తిని వేగవంతం చేస్తున్నాయని వెల్లడించారు. ఎక్కువగా హానికరం కాని అమీబాలలో కొన్ని జాతులు తీవ్రమైన మరియు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా నాగ్లేరియా ఫౌలెరి అనే అమీబా మెదడును ప్రభావితం చేస్తుంది. దీన్ని సాధారణంగా “బ్రెయిన్ ఈటింగ్ అమీబా”గా పిలుస్తారు. కాబట్టి నీటి నిర్వహణ, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాత్రమే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!