

భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన “బాహుబలి” (Baahubali) సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలను ఒకే సినిమాగా కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో 2025 అక్టోబర్ 31న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ కొత్త వెర్షన్‌ను 3 గంటల 43 నిమిషాల నిడివితో ప్రత్యేక ఎడిటింగ్ ద్వారా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఇప్పటికే యూఎస్ఏ, యూకే, యూఏఈ వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్‌ఫుల్‌గా సాగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తొలి రోజే రూ. 8.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఈ రీ-రిలీజ్ విజయవంతం కావడంతో, దర్శకుడు సుకుమార్ కూడా ఇలాంటి ప్రయోగానికి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన రూపొందించిన పుష్ప: ది రైజ్ మరియు పుష్ప 2: ది రూల్ సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కేవలం రెండో భాగమే ₹1800 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇప్పుడు సుకుమార్ ఈ రెండు సినిమాలను ఒకే వెర్షన్‌గా ఎడిట్ చేసి “పుష్ప – ది ఎపిక్ రూల్” పేరుతో రీ-రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. రన్‌టైమ్‌ను 3 గంటల 30 నిమిషాల వరకు కుదించి, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిజమైతే, పుష్ప రాజ్ మళ్లీ బాక్సాఫీస్‌పై తన రాజ్యం కొనసాగించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.














కామెంట్స్ (4)
Pushpa Raj is back! Can’t wait to watch it again!
Pushpa Raj is back! Can’t wait to watch it again!
పుష్ప రాజ్
wuhoooooooo taggedeleeee