

తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్ జంటగా ఇప్పటివరకు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత వారి సూపర్‌స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ మళ్లీ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. అయితే దీనికంటే ముందు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar173) నటించనున్నారు. మొదట సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. కానీ అనూహ్యంగా సుందర్ సి క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వైదొలిగారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కి ఎవరు దర్శకుడవుతారనే ఆసక్తి పెరిగింది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, 'పార్కింగ్' చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు సాధించిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారు. రజనీకాంత్ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా, కథిర్ కీలక పాత్రలో నటించబోతున్నారని ప్రచారం. సంగీతంగా అనిరుధ్ కలిసి పని చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలై, రజనీకాంత్ బర్త్‌డే (డిసెంబర్ 12, 2025)న అధికారిక ప్రకటన రావచ్చు. 2027 పొంగల్‌కి విడుదల అవుతుందని ఆశ. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారని కూడా టాక్. అధికారిక ప్రకటనలు రాగానే మరిన్ని వివరాలు తెలుస్తాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!