
రాజకీయాలు

‘రంగస్థలం’తో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విజయాన్ని అందించిన రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి మరోసారి ‘ఆర్సీ17’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, పాత్రల రూపకల్పన, సాంకేతిక విలువల పరంగా ప్రత్యేకమైన సినిమాను అందించాలనే లక్ష్యంతో సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ‘పెద్ది’ షూటింగ్ సమయంలో చరణ్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స అవసరం ఉండవచ్చని, అనంతరం కొద్ది నెలలు విశ్రాంతి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆర్సీ17 షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!