
జనరల్

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రావు బహదూర్’ సినిమా విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేశారు. ముందుగా జూన్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూలై 3కు మార్చినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక భారీ సినిమాల పోటీ ప్రభావం ఉందనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది.
జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా కారణంగా థియేటర్ లభ్యత, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌ను మరింత మెరుగైన పోస్ట్ ప్రొడక్షన్‌తో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!