

భారీ అంచనాల మధ్య విడుదలైన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 19 న విడుదలైంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లు సాధించి తన స్టామినాను చూపించింది. మొదటి రోజే భారతదేశంలో సుమారు రూ.103 కోట్ల వరకు వసూళ్లు సాధించగా, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా మరో రూ.43 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ.172.63 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది, అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ముందుగా వచ్చిన ‘ధురంధర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ‘ధురంధర్ 2’ ఆ అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ‘జవాన్’, ‘పఠాన్’ వంటి సినిమాల రికార్డులకు పోటీగా నిలుస్తూ, సన్నీ డియోల్ సినిమాల ఓపెనింగ్స్‌ను కూడా దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ.275 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 3 గంటల 30 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. పెద్ద నోట్ల రద్దు, ఉరి దాడి వంటి నిజ జీవిత సంఘటనలు కథకు బలం చేకూర్చాయి.
ఇక రణవీర్ సింగ్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఆయన ‘హంజా అలీ’, ‘జస్కీరత్ సింగ్ రంగీ’ అనే రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆయన సుమారు రూ.50 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది, ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధికం. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటించిన ‘రహమాన్ డకాయిట్’ పాత్రకు మంచి స్పందన వచ్చింది. మొత్తంగా ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలుస్తూ, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!