

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మూవీ పెద్ది (Peddi). ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ స్కేల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సానా 'ఉప్పెన'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అదే డైరెక్టర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్ ఇండియా కాంబినేషన్లో రావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు పెరిగాయి.
అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. "ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల.. పుడతాం ఏటి మళ్లీ" అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ భారీగా వైరల్ అయ్యింది. తరువాత విడుదలైన 'చికిరి' సాంగ్, క్రేజ్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్+ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. దీన్ని బట్టి రామ్ చరణ్ మూవీ పెద్దిపై ఎలాంటి క్రేజ్ ఉందో.. అర్థం చేసుకోవచ్చు. పెద్ది మూవీపై భారీ అంచనాలు నెలకొన్న వేళ.. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీలో దిగాయి. ట్రేడ్ టాక్ ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 130 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట.











కామెంట్స్ (2)
పెద్ది ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేసే మూవీ!
Can’t wait for Peddi!