

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే, సినిమాల్లో రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఛాన్స్ దొరికినప్పుడల్లా షూటింగ్లలో పాల్గొని, పెండింగ్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. నిర్మాతలపై భారం పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే అలాంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. అప్పట్లోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్త బయటకు వచ్చింది.
కానీ అప్పుడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయట. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఆ సమయంలో లోకేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. కానీ లేటెస్ట్ గా లోకేష్ తో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట. KVN ప్రొడక్షన్ లో ఈ భారీ బడ్జెట్ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ అని టాక్ పంపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా రాజకీయాల్లో దూసుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన హరిహర వీరమల్లు వచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా OG సినిమా పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ ఇచ్చింది.
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పూర్తి కాగానే సురేందర్ రెడ్డి తో మరో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను 2026 అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారట. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పాలనలో కూడా తన మార్కు చూపిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!