

హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘స్వయంభు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి పిరియాడికల్ మైథలాజికల్ నేపథ్యంతో రూపొందుతోంది. కథ, పాత్రల పరిచయాన్ని మరింత బలంగా చూపించేందుకు ఈ సినిమాకు ప్రత్యేక వాయిస్ ఓవర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో ఈ వాయిస్ కోసం ఎన్టీఆర్‌ను సంప్రదిస్తున్నారని, హిందీ వెర్షన్‌కు అజయ్ దేవ్‌గణ్ ను ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిఖిల్ సినిమా కోసం ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్ తమ వాయిస్ ఇవ్వడానికి ఒప్పుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026 న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!