

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలను లైన్లో పెట్టుకుంటూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 23వ సినిమాగా ప్రకటించిన ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు మొదలయ్యాయి. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కానీ ప్రాజెక్ట్ విషయంలో ఓ కీలక అంశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
లోకేష్ కనగరాజ్ ఇంకా అల్లు అర్జున్‌కు పూర్తి కథను వివరించాల్సి ఉందని సమాచారం. ఆ కథనం విన్న తర్వాతే సినిమాను ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది నిర్ణయించే అవకాశం ఉందట. తన చిత్రాల విషయంలో బన్నీ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో తెలిసిందే. కంటెంట్‌పై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే ముందడుగు వేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి తొందరపడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఆగిపోయిందనే ప్రచారానికి బలం లేదని, మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!