

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సీక్వెల్ కల్కి 2పై రోజుకో వార్త ఆసక్తిని పెంచుతోంది. 2024లో ఘన విజయం సాధించిన కల్కి 2898 ఏడి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై, ఒక షెడ్యూల్ కూడా పూర్తయినట్టు సమాచారం. తాజాగా బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రకు ఎంపికయ్యారనే ప్రచారం మొదలైంది. ఈ వార్త నిజమైతే, ఆయన 51 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇదే తొలి తెలుగు సినిమా కానుంది. ఇటీవల ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోని మెయిన్ వాపస్ ఆవుంగా చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
కల్కి 2 విషయానికి వస్తే, ఇప్పటివరకు దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఇతర సినిమాల పనులు పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. భారీ కథ, విస్తృతమైన ప్రపంచం, ప్రముఖ నటీనటుల కలయికతో ఈ సీక్వెల్‌పై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అయితే నసీరుద్దీన్ షా పాత్రకు సంబంధించిన వార్తపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!