

ఇటీవల మెగా ఫ్యామిలీలో ఉపాసన సీమంతం చాలా గ్రాండ్‌గా, ప్రైవేట్‌గా జరిగింది. ఆ ఫంక్షన్ గురించి ముందుగా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. ఒకేసారి ఆ వేడుకకి సంబంధించిన అందమైన ఎడిటెడ్ వీడియో రిలీజ్ అయింది అందులో దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించారు. కానీ ఆ వీడియోలో అల్లు ఫ్యామిలీ పూర్తిగా కనిపించకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. మొదట్లో అందరూ “అల్లు అరవింద్, అల్లు అర్జున్, వాళ్ల కుటుంబం ఆ ఈవెంట్‌కి రాలేదేమో” అనుకున్నారు. కానీ ఇప్పుడు లోపలి వర్గాల సమాచారం ప్రకారం అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీ పిల్లలు, వాళ్ల కుటుంబం అంతా కూడా ఆ వేడుకలో ఉన్నారని తేలింది.
ఇప్పుడు అందరికీ డౌట్ “అయితే వీడియోలో వాళ్ల ఫుటేజ్ ఎందుకు చూపించలేదు?” ఇది బయట వాళ్లకే కాదు, బన్నీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్లకూ క్లారిటీ రాలేదు అంటున్నారు.ఇక ఇప్పుడు అభిమానులు, ఇండస్ట్రీ సర్కిల్స్ మధ్య ఇదే హాట్ టాపిక్ “ఫ్యామిలీస్ మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నా, కనీసం బన్నీ పిల్లలను అయినా చూపించవచ్చుగా?” అని చర్చలు మొదలయ్యాయి.










కామెంట్స్ (1)
Hope everything’s fine between the families